షుగర్ వ్యాధి ఉన్న వారు ‘క్యారెట్’ తీసుకుంటే ప్రమాదమా..?

By సుభాష్  Published on  2 April 2020 4:23 AM GMT
షుగర్ వ్యాధి ఉన్న వారు ‘క్యారెట్’ తీసుకుంటే ప్రమాదమా..?

డయాబెటిస్‌ వచ్చిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మనం తినే ఆహారం, రోజువారి పనులలో ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఇలా ఎన్నో రకాల ఒత్తిళ్ల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాము. ముఖ్యంగా డయాబెటిస్‌ వ్యాధి ఉన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారు ప్రతి రోజు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే షుగర్‌ లెవెల్స్‌ అదుపులో ఉండవు. షుగర్‌ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు క్యారెట్‌ను తీసుకోవచ్చా.. లేదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. మరి వైద్య నిపుణులు ఎలాంటి సహాలు, సూచనలు ఇస్తున్నారో చూద్దాం.

క్యారెట్‌

ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఇది ఒకటి. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు నిపుణులు. చూడగానే ఎర్రగా నోరూరించే ఈ వెజిటేబుల్‌ని పెద్దలు, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ కూరగాయని పచ్చిగానే తింటుంటారు. మరికొంతమంది సలాడ్స్‌లో వేసుకుని, జ్యూస్, స్వీట్‌లా చేసి తీసుకుంటుంటారు.

క్యారెట్‌లో ఏ, సి, విటమిన్స్‌తో పాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కంటి చూపు మెరుగు పడటమే కాకుండా చర్మ కాంతివంతంగా తయారవుతుంది. అదే విధంగా రక్త హీనతతో బాధపడేవారు దీనిని తినడం వల్ల సమస్య త్వరగా పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు వీటివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ బీ, ఈలతో పాటు మినరల్స్ కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా చర్మం తాజాగా కనిపించాలంటే రోజూ క్యారెట్ జ్యూస్ తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.

అధిక బరువుని తగ్గిస్తుంది..

బరువు తగ్గాలనుకునే వారు రోజూ క్యారెట్‌ని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు. దీన్ని జ్యూస్‌లా చేసి తాగడం లేదా అలానే తినడం వల్ల శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా క్యారెట్‌ని తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. ఉదయాన్నే ఈ క్యారెట్‌ని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. క్యారెట్‌లో ఎక్కువగా సోడియం అధిక శాతంలో లభిస్తుంది. ఇది బీపీని క్రమపద్దతిలో ఉంచుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చా..

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఈ వెజిటేబుల్‌ని తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. క్యారెట్‌లో షుగర్ కంటెంట్ హై గ్లిజమిక్స్ 97 ఉంటుంది. ఇది గ్లూకోజ్‌గా మారడంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. వీటిని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు డయాబెటిక్ రోగులు వీటిని ఎక్కువగా తినడం వల్ల ఇరిటేషన్, నిద్రలేమి, నీరసంగా మారడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు.

Next Story