చిన్న సినిమాలు చేసుకుంటూ హీరోగా ఒక స్థాయికి మించి ఎద‌గ‌లేక‌పోతున్న యువ క‌థానాయ‌కుడు నాగశౌర్యకు పెద్ద హిట్ ఇవ్వడమే కాక.. అతడి సొంత బేనర్‌కు అదిరే ఆరంభాన్నిచ్చిన ఘ‌న‌త‌ వెంకీ కుడుములకే చెందుతుంది. అత‌డికి తొలి అవ‌కాశం ఇచ్చిన క్రెడిట్ నాగ‌శౌర్య‌ది. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఛ‌లో ఎంత పెద్ద హిట్ట‌యిందో తెలిసిందే. ఐతే సినిమా రిలీజ్ త‌ర్వాత ఎందుకో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి.
వెంకీ ఛ‌లో రిలీజ్ త‌ర్వాత తన కాల్స్ తీయడమే మానేశాడని.. తాను ఇచ్చిన కారును వాడకుండా వేరే వాళ్లకు అమ్మేశాడని ఆరోపణలు చేశాడు నాగశౌర్య.
ఇదే విష‌య‌మై వెంకీని విలేకరులు అడిగితే.. శౌర్య ఇచ్చిన కారును తాను మరొకరికి అమ్మేశానన్నది అబద్ధమన్నాడు. ఆ కారును అమ్మలేదని.. అమ్మే ఉద్దేశం కూడా లేదని.. తన తొలి సినిమా విజయానికి గుర్తుగా అందుకున్న కారును ఎందుకు అమ్ముతానని ప్రశ్నించాడు వెంకీ. కానీ అత‌ను ఆ కారును మాత్రం వాడ‌ట్లేద‌న్న‌ది స్ప‌ష్టం.
క‌ట్ చేస్తే ఇప్పుడు వెంకీకి మ‌రో కారు గిఫ్టుగా వ‌చ్చింది. అది ఇచ్చింది వెంకీ రెండో సినిమా భీష్మ హీరో నితిన్. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం వెంకీ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా నితిన్.. అత‌డికి రోంజ్ రేవ‌ర్ కారు బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఈ ఫొటో కూడా మీడియాలోకి వ‌చ్చింది. ఈ సంగ‌తి వెల్ల‌డి కాగానే మ‌రి ఈ కారునైనా వెంకీ వాడ‌తాడా లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐతే నితిన్.. శౌర్య అంత యారొగెంట్ కాదు, అత‌డితో వెంకీకి గొడ‌వ‌లున్న సంకేతాలు కూడా లేవు కాబ‌ట్టి ఆ కారులో వెంకీ షికార్లు కొడ‌తాడ‌నే ఆశించ‌వ‌చ్చు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *