ఖమ్మం:  కారు అదుపు తప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఆదివారం పొగుల సాగర్ , అతని తల్లి ఇందిర, భార్య స్వాతితో కారులో పయనిస్తున్నారు. కారు అదుపు తప్పి ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా నీళ్లలో మునిగిపోడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని మహబూబా బాద్ జిల్లా చినగూడూరు మండలం బయ్యారంకు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో  స్వాతి 9 నెలల గర్భిణి. కడుపులో శిశువును కాపాడేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వాతికి శస్త్ర చికిత్స చేశారు . ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీసిన ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.