కాన్‌బెర్రాలో కార్చిచ్చు

By సుభాష్  Published on  1 Feb 2020 3:29 AM GMT
కాన్‌బెర్రాలో కార్చిచ్చు

గత కొంతకాలంగా ఆస్ట్రేలియాను బెంబేలెత్తిస్తున్న కార్చిచ్చు రాజధాని కాన్‌బెర్రా సమీపానికి చేరటంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. కార్చిచ్చు ధాటికి ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగిపోవటంతో విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.వీటిని అడ్డుకోవటం అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. ఈ వారాంతానికి కార్చిచ్చు ముప్పు మరింత పెరిగే సూచనలు కన్పిస్తుండటంతో ఎమర్జెన్సీ ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా రాజధాని ప్రాంత ముఖ్యమంత్రి ఆండ్రూ బార్‌ చెప్పారు. ఎసిటి దక్షిణ ప్రాంతంలో 185 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన మంటలు అదుపులోకి రాకపోవటంతో పొంచి వున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు .కాన్బెర్రా దక్షిణ ప్రాంతంలో కార్చిచ్చు ఇప్పటికే 53 వేల ఎకరాలకు పైగా భూమిని బుగ్గిపాలు చేసింది. అనూహ్యరీతిలో విస్తరిస్తున్న మంటలను అదుపు చేయటం అసాధ్యంగా మారుతుండటంతో ప్రజానీకం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.

Next Story