పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి

By సుభాష్  Published on  1 Jan 2020 8:22 AM GMT
పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి

ముఖ్యాంశాలు

  • పట్టాలు తప్పిన రైలు

  • 13 మంది మృతి

  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

  • సహాయక చర్యలు ముమ్మరం

కెనడా దేశంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మనీటోబా ప్రావిన్స్ లోని పోర్టిగాలా ప్రైరీ ప్రాంతంలో ట్రైన్ పట్టాలు తప్పడంతో ఐదుగురు రైల్వే సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారు జామున 6.30 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటన కారణంగా ఇప్పటి వరకు 13 మంది మృతి చెందినట్లు అక్కడి రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటన విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేపట్టారు. చాలా మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైలు ప్రమాదంపై కెనడా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తుకు ఆదేశించింది.

ఈ ప్రమాదంతో కొన్ని రైళ్లను దారి మళ్లించారు. భారీ క్రేన్ల సాయంతో ట్రాక్‌ పునరుద్దరణ పనులు చేపడుతున్నారు. కాగా, ప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయపడ్డ వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు.

Next Story