వాళ్లే ఓట్లేసుకుంటారేమో.. ? – జేసీ దివాకర్‌రెడ్డి

By Newsmeter.Network  Published on  16 March 2020 10:19 AM GMT
వాళ్లే ఓట్లేసుకుంటారేమో.. ? – జేసీ దివాకర్‌రెడ్డి

మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వైకాపా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌ రోజు వాళ్లే ఓట్లు వేసుకుంటారేమో అంటూ వైసీపీ ప్రభుత్వం తీరుపై వ్యంగంగా సమాధాన మిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు వేశామని, ఇక పోలింగ్‌ రోజు ఏజెంట్లు కూర్చున్నా.. పోలీసులు, వైసీపీవాళ్లు కూర్చోనివ్వడం అనుమానమేనని అన్నారు. సోమవారం జేసీ దివాకర్‌ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్‌ కుమార్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన వేళ జేసీ ఎస్‌ఈసీతో భేటీ కావటం ప్రాధాన్యత సంరించుకుంది.

Also Read :ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం.. చివరికి నెగ్గేదెవరు?

భేటీ అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలివైన వాడంటూ తన స్టైల్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మద్యం , డబ్బు పంపిణీ తగ్గిందని, టీడీపీ అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగ్గ విషయమే అన్నారు. ఏపీలో ప్రభుత్వం విధానాలు వాళ్ల స్థాయికి దగ్గట్లు ఉన్నాయని వ్యంగంగా వ్యాఖ్యానించారు. ఏపీలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఉండాలన్నారు. త్రిమూర్తులు ఒక్కరే ఉండి పోలీసులు ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నారని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఇంత కీ ఆ భస్మాసరుడు ఎవరని విలేకరులు ప్రశ్నించగా.. మీ కందరికీ ఆయన పరిచయమేనని, నేను చెప్పా ల్సిన అవసరం లేదని జేసీ అన్నారు. ఇదిలా ఉంటే జే సీ పేర్కొన్న ఆ భస్మాసరుడు ఎవరా అంటూ పలువురు చర్చించుకోవటం కొసమెరుపు.

Next Story
Share it