కాలిఫోర్నియాలో కార్చిచ్చు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 6:25 AM GMT
కాలిఫోర్నియాలో కార్చిచ్చు..!

కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. వైన్ కంట్రీ, రివర్ సైడ్, శాన్‌ప్రాన్సిస్‌కో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి. కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్మేసింది. అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపి వేసిన అధికారులు మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హెలికాప్టర్లు, ట్యాంకర్లతో నీటిని తెచ్చి మంటలను అధికారులు అదుపుచేయటానికి ప్రయత్నిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని ఇళ్లను వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

గత ఏడాది చేలరేగిన కార్చిచ్చులో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో.. ఈసారి అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. గాలి విపరీతంగా ఉండటంతో ఇప్పటికే వేలాది ఎకరాల అడవి బూడిద పాల అయిపోయింది. గతంలో వేసవికాలంలో తరచుగా కాలిఫోర్నియా అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించేవి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇప్పుడు కాస్త ముందుగానే ప్రమాదాలు ప్రారంభమవుతున్నాయని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. గాలిలో తేమ తగ్గిపోవటం, వేడిగాలులు, భూమి పొడిబారటం వంటి కారణాల వల్ల మంటలు అతి త్వరగా వ్యాపిస్తున్నాయన్నారు

Next Story