'క్యాబేజీ' తింటున్నారా..? అయితే బోలెడు ప్రయోజనాలు

By సుభాష్  Published on  17 Feb 2020 4:28 PM GMT
క్యాబేజీ తింటున్నారా..? అయితే బోలెడు ప్రయోజనాలు

► క్యాన్సర్ నిరోధకంగా క్యాబేజీ తినొచ్చు

► క్యాబేజీతో గుండె జబ్బులకు ఎంతో ఉపయోగం

ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మనం తినే తిండి, ఉద్యోగంలో పని ఒత్తిడి, టెన్షన్‌ ఇలా రకరకాల కారణాలతో అనారోగ్యం పాలువుతున్నారు. పోషకాహారాలు తినకపోవడంతో కూడా అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నాము.

కాగా, క్యాబేజీలో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్యాబేజీని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. దీని వల్ల ఉపయోగాలు తెలిస్తే తినని వారు కూడా తింటారు. రోజువారిగా క్యాబేజీని తింటుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. వచ్చే సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

క్యాబేజీలో విటమిన్‌-ఏ, రిబోప్లేవిన్‌, ఫోలేట్‌, బి -6లు, పీచుపదార్ధాలు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే విటమిన్‌-సి ఉండటంతో గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ నిరోధకంగా క్యాబేజీని తినవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పోటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందని, క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందంటున్నారు. అంతేకాకుండా అధిక బరువు, కండరాల నొప్పులు తగ్గుతాయని సూచిస్తున్నారు.

Next Story