హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో బస్సును సురక్షితంగా పొలాల్లోకి తీసుకెళ్లి నిలిపాడు . ఆ తరువాత డ్రైవర్ కూర్చొన్న సీట్లోనే ప్రాణాలు వదిలారు. ధనజోడు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అక్కవరం చేరుకునే సరికి ఈ ఘటన జరిగింది.  డ్రైవర్‌కు గుండె పోటు రావడంతో చాకచక్యంగా వ్యవహరించి..బస్సును పొలాల్లోకి దింపి…  మృతి చెందాడు. ప్రయాణకులు సురక్షితంగా ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.