ఆఖ‌రికి బ‌న్నీ 'సైరా' గురించి స్పందించాడుగా.. ఇంత‌కీ బ‌న్నీ ఏమ‌న్నాడు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 12:14 PM GMT
ఆఖ‌రికి బ‌న్నీ సైరా గురించి స్పందించాడుగా.. ఇంత‌కీ బ‌న్నీ ఏమ‌న్నాడు..?

మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా ట్రైల‌ర్ గురించి ఇండ‌స్ట్రీలో హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు.. ఇలా చాలా మంది స్పందించారు కానీ... స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం స్పందించ‌లేదు. దీంతో చిరు కాంపౌండ్ కి అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నాడు అంటూ ప్ర‌చారం ప్రారంభ‌మైంది. అందుక‌నే చిరు అభిమానులు కూడా సైరా సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో బ‌న్నీ పోస్ట‌ర్స్ లేకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నార‌ట‌.

ఇదిలా ఉంటే.. సైరా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలోనే బ‌న్నీ త‌ను న‌టిస్తున్న‌ 'అల వైకుంఠ‌పుర‌ము'లో సాంగ్ రిలీజ్ చేయ‌డం ఏంటి..? అంటూ ఫ‌్యాన్స్ గుర్రుగా ఉన్నార‌ట‌. ఈ విష‌యం బ‌న్నీ వ‌ర‌కు చేరింది. దీంతో.. బ‌న్నీ 'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమా గురించి, మెగాస్టార్ చిరంజీవి గురించి సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

ఇంత‌కీ ఏమ‌ని మెసేజ్ చేశాడంటే... సైరా న‌ర‌సింహారెడ్డి.. మా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ గొప్ప చిత్రం. తెలుగు సినిమా గ‌ర్వ‌ప‌డాల్సిన రోజు ఇది. నేను చాలా ఏళ్ల క్రితం వెండితెరపై మ‌గ‌ధీర చిత్రాన్ని చూసిన‌ప్పుడు చిరంజీవి కూడా ఇలాంటి ఎఫిక్ మూవీలో చూడాల‌నుకున్నాను. నా కోరిక ఈరోజు ఇలా నిజ‌మైంది. ఇలాంటి ఎపిక్ మూవీని మా చిరంజీవిగారితో నిర్మించిన నిర్మాత‌, నా సోద‌రుడు రామ్‌చ‌ర‌ణ్‌కి ధ‌న్య‌వాదాలు.. కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న లెగ‌సీకి చ‌ర‌ణ్ ఇచ్చిన కానుక‌. ఓ కొడుకు తండ్రికి ఇంత కంటే గొప్ప గిఫ్ట్‌ను ఏం ఇవ్వ‌గ‌ల‌డు. ఎంటైర్ యూనిట్‌కు నా అభినంద‌న‌లు. అలాగే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారికి ప్ర‌త్యేక‌మైన కృతజ్ఞ‌త‌లు. సైరా మ‌న హృద‌యాల్లో ఎప్ప‌టికీ చెర‌గ‌ని మ్యాజిక్‌ను క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

Next Story
Share it