గాయంతో బుమ్రా అవుట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 3:51 PM GMT
గాయంతో బుమ్రా అవుట్..!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు గాయంతో బుమ్రా దూరమయ్యారు. బుమ్రా స్థానంలో ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

వెస్టిండీస్‌ టూర్‌లో బుమ్రా మంచి ప్రతిభను కనబరిచాడు. రెండు మ్యాచ్‌ల్లో 13వికెట్లు తీసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ హ్యాట్రిక్ సాధించి..టెస్ట్‌లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారతీయ బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. గురువారం నుంచి విశాఖలో రెండు జట్ల మధ్య మూడ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ జరగనుంది.

ఇరుజట్ల ఆటగాళ్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

టీమిండియా టెస్టు జట్టు వివరాలు

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే(వైఎస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్ గిల్‌

Next Story
Share it