దిగివస్తున్న బంగారం, వెండి ధరలు
By సుభాష్ Published on 17 Sep 2020 12:48 PM GMT
పసిడి ధరలు దిగివస్తున్నాయి. వరుసగా రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి కూడా అదే దారిలో వెళ్తోంది. వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజే రూ.360 తగ్గి, ప్రస్తుతం రూ.49,090కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గుతూ ప్రస్తుతం రూ.53,550కు చేరింది. ఇక వెండి ధర భారీగానే పతనమైంది. బుధవారం రూ. 500 మేర తగ్గగా, గురువారం ఒక్క రోజే 1200 తగ్గింది. రెండు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.1700 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.67,800 చేరుకుంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,945.00 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 26..91 డాలర్లు. కాగా, వడ్డీ రేట్లు 2023 వరకు సున్నా స్థాయిలో ఉంచాలని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో బంగారం, వెండి ధరలు మందగిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.