‘దిశ’ పథకానికి బడ్జెట్ కేటాయింపు..

By Newsmeter.Network  Published on  11 Feb 2020 1:14 PM GMT
‘దిశ’ పథకానికి బడ్జెట్ కేటాయింపు..

దిశ పథకం అమలుకు రూ.47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో దిశ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర హోంశాఖ తెలిపింది. ‘దిశ’ చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున​ ప్రస్తుతానికి దిశ పథకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ ఆదేశాల నేపథ్యంలో.. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం.. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి, పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో ఏడుగురు అధికారులు, సిబ్బంది ఉంటారని తెలిపారు. ‘దిశ’ చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున​ ప్రస్తుతానికి దిశ పథకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

Next Story