పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు

►గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి నాబార్డు రుణాలు

► కిసాన్‌ క్రిడిట్‌ పేరుతో రైతులకు మరిన్ని రుణాలు

► మత్స్య కారులకు సాగర్‌ మిత్ర పథకం

► గోదాముల నిర్వహణ స్వయం సహాయక గ్రూపులకు అప్పగిస్తాం

► వ్యవసాయ రంగానికి రూప.2.83 లక్షల కోట్లు కేటాయింపు

► గ్రామీణ అభివృద్దికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు

► ఆయుష్మాన్‌భవతో దేశ వ్యాప్తంగా 20వేల ఆస్పత్రుల ఏర్పాటు

► 2025 నాటికి పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనే లక్ష్యం

► కౌలు భూములకు కొత్త చట్టం

► రైతులు సంప్రదాయ ఎరువులకు పెద్దపీట వేయాలి

►సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం

► వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు కొత్త గోదాములు

► పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్‌ రైతు ఏర్పాటు

► రైతుల కోసం ఉడాన్‌ పథకం

► నాబార్డు పథకాన్ని పొడిగిస్తాం

► సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌

► జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.3.06 లక్షల కోట్లు

► స్వచ్ఛభారత్‌కు రూ.12.300 కోట్లు

► త్వరలో కొత్త విద్యా విధానం

► ఉన్నత విద్యలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.