వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పై టీడీపీ నేత బుద్దా వెంక‌న్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డిని కూడా విచారించాల్సి ఉందన్నారు. విజయసాయిరెడ్డిని సైతం సీబీఐ విచారించాలని కోరుతూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కోర్టులో పిటిషన్ వేయాలని సూచించారు. ఈ మేరకు గురువారం బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు.

వివేకా చనిపోయిన రోజు విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ సంభ్రమాశ్చర్యాలకు గురైనట్లు చెప్పారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్ చనిపోతే విజయసాయిరెడ్డి ఎందుకు సంబరాలు చేసుకున్నారని ప్రశ్నించారు. విజయసాయికి నార్కో అనాలిసిస్ పరీక్ష చేస్తే వివేకా హత్య చిక్కుముడి విడిపోతుందని పేర్కొన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.