రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పులకల గ్రామానికి చెందిన బీటెక్‌ నరేష్ కుమార్ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత శుక్రవారం ఇంట్లో నుండి మధ్యాహ్నం చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన నరేష్‌, ఆలయం వద్ద బైక్‌ పార్కింగ్ చేసి గండిపేట చెరువుకు వెళ్లాడు. అక్కడ నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, మంగళవారం శవం నీటిపై తేలుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఈతగాళ్ళతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ముందుగా మిస్సింగ్‌ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు, నరేష్‌ ఆత్మహత్యపై ఆరా తీస్తున్నారు. మృతుడు ఇంట్లోనుంచి వెళ్లెటప్పుడు సూసైడ్‌ నోట్‌ రాసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.

Newsmeter.Network

Next Story