బ్రిటన్ లో తొలి కరోనా మృతి నమోదు

By రాణి  Published on  6 March 2020 10:06 AM GMT
బ్రిటన్ లో తొలి కరోనా మృతి నమోదు

కరోనా సోకి బ్రిటన్ లో తొలి కరోనా మృతి కేసు నమోదైంది. గురువారం బ్రిటన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. యూకే లో మొత్తం 115 మంది కరోనా బాధితులుండగా..కరోనా సోకిన ఒక వ్యక్తి (80) రాయల్ బెర్క్ షైర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు క్రిస్ పేర్కొన్నారు. కరోనా సోకి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారాయన. అందులోనూ ఆయన పెద్ద వయసు వ్యక్తి కావడంతో కరోనా నుంచి కోలుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు.

https://telugu.newsmeter.in/i-dont-wanna-bowl-for-shafali-verma/

ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 96 వేల మందికి పైగా సోకగా..3300 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇండియాలో ఇప్పటికి 31 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు అన్ని ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. అలాగే..ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు తమకు కరోనా లేదని ధృవపత్రం చూపిస్తేనే అనుమతిస్తామని చెప్పేసింది ఇక్కడి ప్రభుత్వం. కరోనాను నివారించేందుకు ఏకైక మార్గం శుభ్రతేనని వైద్యులు చెబుతున్నారు.

https://telugu.newsmeter.in/bs4-vehicles/

Next Story