భారత పర్యటనకు రానున్న బ్రిటన్ యువరాజు చార్లెస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 6:32 PM GMT
భారత పర్యటనకు రానున్న బ్రిటన్ యువరాజు చార్లెస్

బ్రిటన్ యువరాజు చార్లెస్ భారత్‌లో పర్యటించనున్నారు. నవంబరు 13న ఆయన భారత్ వస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రిన్స్ చార్లెస్ పర్యటన కొనసాగనుంది. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సహా అత్యున్నత స్థాయి వ్యక్తులతో ఆయన భేటీ కానున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మార్కెట్ల స్థిరీకరణ, వాతావరణ మార్పులు, సోషల్ ఫైనాన్స్ వంటి అంశాలపై ప్రముఖులతో చర్చించనున్నారు. ప్రిన్స్ చార్లెస్ రాకతో బ్రిటన్- భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

సుదీర్ఘ కాలంగా బ్రిటీష్ యువరాజుగా కొనసాగుతున్న వ్యక్తిగా ప్రిన్స్ ఛార్లెస్ రికార్డు సృష్టించారు. నవంబర్ 14న ఆయన 71వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. తన జన్మదినోత్సవాన్ని ఆయన భారత్‌లోనే జరుపుకోను న్నారు. ప్రిన్స్ చార్సెస్ ఇప్పటివరకు 9సార్లు భారత్‌ను సందర్శించారు. 2017 నవంబర్‌లో చివరిసారిగా భార్య కెమిల్లాతో కలిసి మనదేశానికి వచ్చారు.

Next Story