ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆరు నెలల పాటు లాక్‌డౌన్..!
By సుభాష్ Published on 28 March 2020 8:06 PM ISTఅతివేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కంటికి కనిపించని కరోనా వైరస్ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ మహమ్మారి కారణంగా అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక తాజాగా బ్రిటన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు మరో ఆరు నెలల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని భావిస్తోన్నట్లు సమాచారం. కరోనా రెండో దశకు చేరకుండా చర్యలు చేపట్టాలంటే సెప్టెంబర్ వరకు లాక్‌డౌన్ ప్రకటించాల్సి ఉందని బ్రిటన్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ జెన్సీ హారిస్ అభిప్రాయపడ్డారు.
మరి కొన్ని నెలలు పొడిగిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని, లేకోతే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది. ఇక లాక్‌డౌన్ అమలవుతున్నందున ప్రజలు బయటకు రాకుండా ఉండాలని అక్కడి ప్రభుత్వం కోరుతోంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అనుకోవడం లేదని, ఇప్పుడే ఎత్తివేస్తే మా ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని బ్రిటన్ పేర్కొంది.
కాగా, బ్రిటన్‌లో గత వారంలో కొత్తగా 6వేల 903కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వారంలోనే ఇప్పటి వరకు 2వేల 710 మంది కరోనా బారిన పడ్డారు. అయితే లండన్‌లో వచ్చే రెండు మూడు వారాల్లో గడ్డుకాలం తప్పదని నిపుణులు హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, యువరాజు చార్లెస్‌తో పాటు ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్ ఇప్పటికే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.