• వేములవాడలో భారీ వర్షాలు
  • కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి
  • కాంట్రాక్టర్ పై ప్రజలు ఆగ్రహం

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేములవాడ మూలవాగు పొంగిపొర్లుతోంది.వరద ప్రవాహం పెరగడంతో రూ. 22 కోట్ల నూతనంగా నిర్మిస్తున్న వంతెన అంచులు కూలిపోతున్నాయి. గత నాలుగేళ్లుగా బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. నాలుగేళ్లుగా నడుస్తున్న నిర్మాణ పనుల్లో ఒక బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. దీనిపై రాకపోకలు కూడా సాగుతున్నాయి. మరో బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే వరద ప్రవాహానికి బ్రిడ్జి కూలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేస్తున్నారని అందువల్లనే బిడ్జి కూలిందని ప్రజలు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.