బ్రెగ్జిట్ ఎటూ తేలడం లేదు. గడువు మీదు గడువు పొడిగిస్తున్నారు. తాజాగా మరోసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడానికి 3 నెలలు గడువు ఇచ్చారు. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఈయూలోని 27 సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. ఈ నిర్ణయంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన ప్రక్రియే బ్రెగ్జిట్. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. ఐతే, ప్రక్రియ మాత్రం నత్త నడకన కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ప్రధానులు వైదొలిగారు. ప్రస్తుత గడువు ఈ నెల 31న పూర్తి కానుంది. దాంతో మరో మూడు నెలలు పొడిగించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈయూకు లేఖ రాశారు. ఆ లేఖపై చర్చించిన ఈయూ సభ్య దేశా లు, పొడిగింపునకు ఓకే చెప్పాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.