తిరుచిరాపల్లి: తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా నాడుకపట్టి గ్రామంలోని బోరు బావిలో ప్రమాదవశాత్తూ రెండున్నరేళ్ల బాలుడు పడ్డాడు. బాలుడ్ని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. చిన్నారి పేరు సుజిత్. బాలుడు ఆడుకుంటూ 26 అడుగుల బోరు బావిలొ పడ్డాడు. దాదాపు 20 గంటల నుంచి సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే..సమయం గడిచే కొద్దీ బాలుడి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బోరు బావిలో పడినప్పటి నుంచి ఆహారం, మంచినీళ్లు అందకపోవడంతో అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర దుఖఃలో మునిగిపోయారు. అధికారులు బోరులోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు.

బోరుకు సమాంతరంగా గోతిని తీస్తున్నారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

Image result for thiruchurapalli bore boy"

Image

Image

Image

Image

 

 

 

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.