ప్యాసింజర్‌ రైల్లో బాంబు కలకలం..! పోలీసుల అదుపులో ఒకరు

By సుభాష్
Published on : 23 Dec 2019 8:31 PM IST

ప్యాసింజర్‌ రైల్లో బాంబు కలకలం..! పోలీసుల అదుపులో ఒకరు

రైల్లో బాంబు ఉందని ఓ అకతాయి బెదిరింపులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంతో గడిపారు. తీరా రైల్లోఎటువంటి బాంబు లేదని తేలడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్తున్నప్యాసింజర్‌ రైల్లో చోటు చేసుకుంది. ఈ కారణంగా అనంతపురం జిల్లా కదిరి వద్ద రైలును నిలిపివేసి బాంబు బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. చివరు ఎలాంటి బాంబు లేదని తేల్చి చెప్పారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

కదిరి వద్ద ప్యాసింజర్‌ రైలులో ఓ కొందరు ఆకతాయిలు లేటర్‌ రాసి ప్రయాణికుల మధ్యలోపడేశారు. అది చూసిన ప్రయానికులు రైలులో మూడో కోచ్‌లో బాంబు ఉందని హడావుడిగా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కదిరి రైల్వేస్టేషన్‌కు రాగానే రైల్లోని మూడో కోచ్‌లో తనిఖీలు చేశారు. ఎటుంటి బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిలు పీల్చుకున్నారు. కాగా, ఈ కారణంగా రైలు గంట పాటు ఆలస్యంగా బయలుదేరింది.

ఆగంతకున్ని గుర్తించిన పోలీసులు

ట్రైన్‌లో బాంబు ఉందని లేటర్‌ రాసిన ఆగంతకున్నిపోలీసులు గుర్తించారు. గణేష్‌ అనే వ్యక్తి ఈ బెదిరింపు లేఖ రాసినట్లు గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story