అర్థరాత్రి కలుద్దాం.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా..

By Newsmeter.Network  Published on  6 Feb 2020 11:03 AM GMT
అర్థరాత్రి కలుద్దాం.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా..

అభిమానులను పొందడం అంత సులువు కాదు. ఒక్కసారి వారి అభిమానం పొందితే చాలు.. సెలబ్రెటీలుగా మారిపోవచ్చు. ఇక సినీ ఇండస్ట్రీలో నటీనటులకు అభిమానులు ఏ రేంజ్‌లో ఉంటారో చెప్పనక్కర లేదు. తమ అభిమాన నటులను కలుసుకోవడానికి వారి ఇంటి ముందు పడిగాపులు గాస్తుంటారు. అభిమానం ఇలా అయితే ఫర్వాలేదు.. గానీ ఈ.. అభిమానిలా ఉండకూడదని అంటోంది బాలీవుడ్ నటీ హీనా ఖాన్‌.

అసలు ఏం జరిగిందంటే.. ఓ అభిమాని హీనా ఖాన్‌ ను వేధిస్తున్నాడట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మేము సెలబ్రెటీలం కాబట్టి ఎంతో మంది అభిమానులు ఉంటారు. మమ్మల్ని కలవడం కోసం.. ఎంతో మంది ఇంటి ముందు రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు. వీళ్లతో పెద్దగా ఏం ఇబ్బంది లేదు కానీ.. ఓ అబ్బాయి మాత్రం చాలా కాలంగా టార్చర్‌ పెడుతున్నాడని చెప్పింది. నా ఫోన్‌ నెంబర్‌ ఎలా తెలుసుకున్నాడో తెలీదు గానీ.. రోజు మెసేజ్‌ లు చేసి విసిగిస్తుంటాడు.

ఒక్కోసారి నేనంటే ఎంత ఇష్టమో గట్టిగా కేకలు వేస్తూ వీడియోలు కూడా తీసి పంపుతూ ఉంటాడు. దాంతో ఓసారి అతనికి రిప్లై ఇచ్చాను. ఇలాంటి పనులు చేయకు అని చెప్పాను. కానీ అతను వినలేదు. ఇంకా అతని వేదింపులు ఎక్కువయ్యాయి. రాత్రి 1 గంటకు కలుస్తానని.. మాట్లాడకపోతే చెయ్యి కోసుకుంటానని బెదిరించేవాడు. అతనెవరో తనకు తెలీదని.. అర్థరాత్రి ఎక్కడ ఇంటికి వచ్చేస్తాడోనని భయపడి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిపోయిన రోజులు చాలా ఉన్నాయని బాధపడింది. చాలా సార్లు ఆ నెంబర్‌ను బ్లాక్ చేశాను. అయినా కొత్త నెంబర్లతో మళ్లీ మెసేజ్‌ లు చేసేవాడు.. ఇలా ఇప్పటి వరకు ఇరవైకి పైగా నెంబర్లను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు.

Next Story
Share it