ధైర్యంగా ఉండండి..మధులతతో డీజీపీ సవాంగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2019 2:24 PM GMT
ధైర్యంగా ఉండండి..మధులతతో డీజీపీ సవాంగ్

తూ.గో జిల్లా: సుడిగుండం వారి జీవితాలను గల్లంతు చేసింది. విహారానికి పోయి విషాదంలో మునిగి పోయారు. వారి కుటుంబాలకు అంతులేని ఆవేదనను మిగిల్చారు. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదం గోదావరంత విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో భర్తతోపాటు కూతురును కోల్పోయిన మధులతను డీజీపీ సవాంగ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. కూతురు హాసినిని తలచుకుని డీజీపీ ఎదుట మధులత గుండెలవిసేలా రోధించింది. ఈ సందర్భంగా పడవ మునగడానికి ముందు మునిగే సమయంలో అక్కడ స్విచ్‌వేషన్‌ను ముధులతను అడిగి డీజీపీ తెలుసుకున్నారు. పడవ మునిగే సమయంలో ఎవరూ లైఫ్ జాకెట్లు వేసుకోలేదని మధులత చెప్పింది. అందరూ పాటలు పాడుతూ, డాన్స్‌లు వేస్తుండటంతో లైఫ్ జాకెట్లు తీశారని చెప్పింది. బోటుకు అనుమతిలేదన్న విషయం తెలిస్తే ఎవరూ ఎక్కేవారిమేకాదని తెలిపింది. బోటు అందరూ చదువుకున్నవారే ఉన్నారంది. పడవ బోల్తా పడగానే తన భర్త సుబ్రమణ్యం తనను పైకి నెట్టారని..పాపను కూడా పట్టుకున్నారని తెలిపింది. తనను కాపాడమని పాప తన కాళ్లు పట్టుకున్నా కాపాడుకోలేకపోయానని మధులత కన్నీరుమున్నీరైంది. హాసీని మృతదేహం దొరికింది కాని..ఇప్పటి వరకు సుబ్రమణ్యం జాడ దొరకలేదు. తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తండ్రి అస్తికలను కలపడానికి బోటులో బయల్దేరారు.

ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 26మృతదేహాలు వెలికి తీశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీటిలో 23 మృతదేహాలను అధికారులకు అప్పగించారు. ఏడు మృతదేహాలు బంధువులు తీసుకెళ్లారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. బోటు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సీఎం వైఎస్ జగన్ ప్రమాదస్థలంలో ఏరియల్ వ్యూ నిర్వహించారు. హోం మంత్రి సుచరితతో కలిసి బాధితులను మంగళవారం పరామర్శించారు.

Next Story