బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరు అరెస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 6:20 AM GMT
బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరు అరెస్ట్

కాకినాడ: ఇటీవల దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఈనెల 20న ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన సంగతి తెలిసిందే. ఏ విధమైన అనుమతులు లేకుండా పోర్టు అధికారులు ఇచ్చిన సర్క్యులర్‌ ఆధారంగా బోటు ప్రయాణాలు ప్రారంభించిన గెడా వీర వెంకట సత్యనాగ మురళి, యర్రంశెట్టి రాజారావులను సోమవారం కోర్టులో హజరుపరిచినట్టు ఏఎస్పీ తెలిపారు.

Next Story
Share it