హైదరాబాద్ లోని మసీదులోకి బ్లాక్ పాంథర్ ప్రవేశించిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 May 2020 5:01 AM GMT
హైదరాబాద్ లోని మసీదులోకి బ్లాక్ పాంథర్ ప్రవేశించిందా..?

మసీదులోకి పులి ప్రవేశించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. మే14న హైదరాబాద్ లోని ఫతే దర్వాజాలోని మసీదులోకి పులి ప్రవేశించింది. మస్జిద్-ఏ-నూరాని వద్ద స్థానికులు ఆ పులిని చూశారు. దాన్ని 'బ్లాక్ పాంథర్'(నల్ల పులి) అంటూ స్థానికులు మొదట భావించి అధికారులకు సమాచారం అందించారు. నెహ్రు జూలాజికల్ పార్క్ అధికారులు దాన్ని పట్టుకోడానికి వచ్చారు. మసీదు ప్రాంగణంలో దాన్ని గుర్తించారు. స్థానికులు పొరబడినట్లుగా అది 'బ్లాక్ పాంథర్' కాదని 'గండు పిల్లి' (Asian Palm Civet) అని తెలిపారు.

మే 14 ఉదయం 2 నుండి 3 గంటల మధ్యలో స్థానికులు పులి లాంటి ఆకారం ఉన్న జంతువు మసీదులోకి ప్రవేశించడాన్ని చూసారు. దీంతో జూకు ఫోన్ చేయగా వారు అక్కడికి చేరుకున్నారు. మసీదులోని మినార్ లలో ఆ జంతువు ఉండడాన్ని చూశారు. కేవలం 8 ఇంచీల ఖాళీ ప్రదేశంలో బ్లాక్ పాంథర్ ప్రవేశించడం సాధ్యం కాదని చెప్పారు. నలుపు రంగులో ఉన్న జంతువు కావడంతో తెల్లవారే వరకూ ఎదురుచూసారు. అప్పటికే మసీదు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసివేశారు. అలా మసీదు లో ఉన్న నల్ల చిరుతను పట్టుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టి దాదాపు గంట పాటు శ్రమించి తర్వాత దానిని పట్టుకున్నారు. అందరూ పొరబడినట్లుగా నల్ల చిరుత కాదని అధికారులు తేల్చారు.

చిలుకూరు, గోల్కొండ ప్రాంతాల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. దీన్ని పట్టుకునే సమయంలో స్థానికులను ఎవరినీ బయటకు రావద్దని తెలిపారు అధికారులు. గండు పిల్లి అక్కడికి వచ్చినప్పటికీ.. కొందరు మాత్రం అది నల్ల చిరుత అంటూ ఫోటోలను సర్క్యులేట్ చేస్తున్నారని గోల్కొండ పోలీసు ఇన్స్పెక్టర్ కె.చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. నల్ల చిరుతలు తెలంగాణలోనే లేవని ఆయన తేల్చేశారు.

Next Story