తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను..బీజేపీ నేత పరిపూర్ణానంద రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళిసై గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశాక.. మొదటి సారిగా పరిపూర్ణానంద తమిళిసైను కలిసి అభినందనలు తెలియజేశారు. గతంలో కూడా గవర్నర్‌తో తనకు పరిచయం ఉన్నట్లు పరిపూర్ణానంద చెప్పారు. గతంలో తమిళిసై..తమిళనాడులో బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిందన్నారు. దీని ద్వారా ప్రజా సమస్యలపై తమిళిసైకి పూర్తి అవగాహన ఉందన్నారు. మా సంభాషనంతా తమిళంలోనే జరిగిందన్నారు.

అయితే తమిళిసైతో తాను రాజకీయాల గురించి చర్చించలేదని స్పష్టం చేశారు. కేవలం గవర్నర్‌ను స్నేహపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా పరిపూర్ణానంద స్పందించారు. ఆర్టీసీ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారుతోందని పరిపూర్ణానంద అన్నారు. వెంటనే ప్రభుత్వం తగు చర్యలు చేపడితే మంచిదని పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story