ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 9:26 AM GMT
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ప్రయోజనాలు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీల నిర్ణయాలు మారిపోతుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఊహించని ఘటన జరిగింది. కమ్యూనిస్ట్‌ జెండాలు, బీజేపీ జెండాలు ఒక గూటి కిందకు వచ్చాయి. ఒకే ర్యాలీలో కమ్యూనిస్ట్ జెండాలు, బీజేపీ జెండాలు కలిసి ఎగిరాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలని 11 రోజులుగా డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ, బీజేపీ నేతలు కలిసి వారికి మద్దతు ఇచ్చారు. మొత్తానికి ఎప్పుడూ కలవని వారిని కూడా కలిపిన ఘనత కేసీఆర్‌దేనని ఆర్టీసీ కార్మికులు, రాజకీయ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.

మరో వైపుఉస్మానియా యూనివర్శిటీ ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్ధులు గద్ధం చేశారు. మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి బయల్దేరిన విద్యార్దులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

Next Story