ట్రూజెట్ విమానానికి త్రుటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కడప నుంచి విజయవాడకు వెళుతున్న ట్రూజెట్‌ విమానానం టేకాఫ్‌ అయిన వెంటనే పక్షి త‌గ‌ల‌డంతో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. సేఫ్‌గా ల్యాండ్‌ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. దీంతో విజయవాడ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించిన అధికారులు ప్ర‌యాణికులను విజ‌య‌వాడ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.