బిల్‌గేట్స్ కోసం తయారయ్యే నౌక ఖరీదు.. రూ. 4600 కోట్లు.. సౌకర్యాల గురించి తెలిస్తే..
By సుభాష్
ప్రపంచంలోనే ధనికుడుగా ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ విలాసవంతమైన విహార నౌకను కొనుగోలు చేశారు. గత సంవత్సరం మొనాకోలా నిర్వహించిన యాట్‌షోలో బిల్ గేట్స్ దీనిని చూసి సంబురపడ్డాడు. ఇక ఈ నౌక వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హాని ఉండదని తెలుసుకుని తన కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకోవాలని అనుకున్నాడట. ఇక అనుకున్నదే ఆలస్యం వెంటనే నౌక తయారు చేసి సంస్థకు కొంత డబ్బును చెల్లించి పనులను ప్రారంభించాలని సూచించారు.
నౌక పొడవు 370 అడుగులు
ఈ నౌక పేరు ఆక్వా నౌక. దీని పొడవు 370 అడుగులు. ఇందులో నాలుగు అతిథి గదులు, రెండు వీఐపీ గదులు, యజమాని గది ఉంటుంది. ఇందులో ఐదు డెక్‌లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్‌లో వెళ్లే సౌకర్యం ఉంటుంది. అంతే కాదు నౌకలో ఒక జిమ్, యోగా స్టూడియో, బ్యూటీ రూం. మసాజ్ పార్లర్, ఇంకా చెప్పాలంటే స్మిమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలు ఈ నౌకలో ఉన్నాయి.
లిక్విడ్ హైడ్రోజన్‌తో..
ఈ నౌకను బిల్‌గేట్స్ తరచూ వెకేషన్‌కు వెళ్లేందుకు కొనుగోలు చేశారట. ఈ నౌక లిక్విడ్ హైడ్రోజన్‌లో నడుస్తుంది. కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది.
బోటు ధర రూ. 4600 కోట్లు
ఇక అసలు విషయానికొస్తే ఈ బోటు ధర వింటే షాకవ్వాల్సిందే. అక్షరాల రూ.4600 కోట్లు. లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచే నౌక కావడం ప్రపంచంలోని మొదటిది కావడం విశేషం. ఈ నౌకలో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపినట్లయితే 3750 మైళ్లు ప్రయాణిస్తుందట. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఈ బోటులో బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న నౌకలు కూడా ఉంటాయి. కాగా, బిల్‌గ్రేట్స్‌కు సొంత విహార నౌక అంటూ ఏది లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్‌గేట్స్ చేతికి రానుందట.