సైబర్ నేరగాళ్ల ఆటకట్టించిన పోలీసులు

By రాణి  Published on  3 Jan 2020 12:18 PM GMT
సైబర్ నేరగాళ్ల ఆటకట్టించిన పోలీసులు

ఆన్ లైన్ లో బల్క్ మెసేజ్ లు పంపి లక్షలకు లక్షలు నగదు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ సైబర్ ముఠాను సీపీ సజ్జనార్ శుక్రవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతేడాది నవంబర్ నెలలో ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ దర్యాప్తు చేయగా..బీహార్ కు చెందిన ముఠా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వినియోగదారులే వీరి టార్గెట్ అని తెలిపారు. స్నాప్ డీల్, అమెజాన్, నేప్తాల్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలకు చెందిన డేటా ఆధారంగా వీరంతా బల్క్ మెసేజ్ లు పంపి మోసాలకు పాల్పడేవారని వివరించారు. మీ మొబైల్ నెంబర్ లక్కీ డ్రా తీస్తే..మీకు ఫ్రిజ్ వచ్చింది. కార్ వచ్చింది. మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెప్తే గిఫ్ట్ మీ ఇంటికి పంపిస్తామని చెప్పి ఓటీపీ చెప్పగానే సదరు వినియోగదారుని అకౌంట్ లో ఉన్న నగదంతా దోచేస్తారని తెలిపారు.

ఇదే తరహాలో మోసపోయింది ఒక మహిళ. కార్ గెలిచారంటూ మెసేజ్ పంపి వివిధారూపంలో మెత్తం 2 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదు చేయడంతోనే..ఈ సైబర్ నేరగాళ్లను పట్టుకోగలిగామన్నారు. వారినుంచి స్మార్ట్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇకనైనా ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానముంటే పోలీసులను సంప్రదించాలని సీపీ కోరారు.

Next Story
Share it