బిగ్‌బాస్-4: నాగార్జునకు భారీ పారితోషకం..!
By సుభాష్ Published on 30 July 2020 2:13 PM ISTతెలుగులో బుల్లితెరపై తెలుగు ప్రజలను ఎంతో ఆకట్టుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్ ప్రారంభం అయ్యేందుకు రెడీ అవుతోంది. మొదటి సీజన్ ఎన్టీఆర్‌గా హోస్టు నిర్వహించగా, రెండో సీజన్ నాని నిర్వహించారు. ఇక మూడు సీజన్ అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయగా, ఇప్పుడు నాలుగో సీజన్ కూడా అతనే హోస్టుగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌లను ఇప్పటికే ఫైనల్ కాగా, వారికి టెస్టులు నిర్వహించి ఐసోలేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న కింగ్ నాగార్జు భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 70 రోజుల పాటు జరిగే ఈ షోలో నాగార్జున పది రోజుల పాటు కనిపించనున్నారు. ఇంక ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షల చొప్పున నాగార్జున పారితోషకం తీసుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సీజనలో 13 మంది కంటెస్టెంట్‌లు సందడి చేయనున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీని తీసేసినట్లు సమాచారం. అయితే కరోనా నేపథ్యంలో ఈ సీజన్ ఉంటుందా..? లేదా...? అనే అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశారు బిగ్‌బాస్ నిర్వాహకులు. నాలుగో సీజన్‌కు సంబంధించి ప్రమోను సైతం విడుదల చేశారు.