బిగ్‌బాస్ సీజ‌న్ 4 : గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న సుధీర్-ర‌ష్మీ..!

By రాణి  Published on  4 Feb 2020 12:47 PM GMT
బిగ్‌బాస్ సీజ‌న్ 4 : గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న సుధీర్-ర‌ష్మీ..!

ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ త్వ‌ర‌లోనే మొద‌లు కాబోతుంది. ఇప్ప‌టికే స‌క్సెస్‌ఫుల్‌గా మూడు సీజ‌న్‌ల‌ను పూర్తి చేసుకుని మ‌ళ్లీ అదే ఎన‌ర్జీతో ఆ షోను మ‌న ముందుకు తీసుకొచ్చేందుకు నిర్వాహ‌కులు ఏర్పాట్ల‌ను మొద‌లు పెట్టేసిన‌ట్టు టాలీవుడ్ బోగ‌ట్టా.

ఎన్టీఆర్‌, నాని, నాగార్జున హోస్ట్ చేసిన ఈ బిగ్ బాస్‌లో ఈసారి ఇంకాస్త డోస్ పెంచేందుకు నిర్వాహ‌కులు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. బిగ్‌బాస్ సీజన్ - 4 కూడా ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ చేసిన సీజ‌న్ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందుకుందో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే, ఈ సారి షోలో బుల్లితెర నుండి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఉంటుంద‌న్న‌ది తాజా స‌మాచారం. బిగ్‌బాస్ -3 సీజ‌న్‌లోనే సుధీర్‌ను తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు చాలా ప్ర‌య‌త్నించార‌ని, కానీ సుధీర్ త‌న సినిమాలు, షో లు మ‌ధ్య‌లో ఆగిపోతాయ‌ని ఆ ఆఫ‌ర్‌ను వ‌దులుకున్న‌ట్టు తెలుస్తుంది.

ఇటీవ‌ల ముగిసిన సీజ‌న్‌లో యాంక‌ర్ శ్రీముఖి ఏ రేంజ్‌లో అద‌రగొట్టిందో మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్‌లో సుడిగాలి సుదీర్ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. కానీ, సుధీర్‌కు ఉన్న బిజీ లైఫ్‌కు అదంత ఈజీ కాద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే సుధీర్ మూడు షోలు, రెండు సినిమాలు అంటూ తీరిక లేకుండా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు. అలాంటిది బిగ్ బాస్‌కు వెళితే మాత్రం అభిమానుల‌క‌న్నా టీవీ షోల యాజమాన్యం బాగానే క‌ష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ, పోవే పోరా వంటి షోలు స‌క్సెస్ అవ‌డానికి కార‌ణం సుడిగాలి సుధీర్ అన్న విష‌యం తెలిసిందే.

కనుక సుధీర్ బిగ్ బాస్ షోలో క‌న్నా టీవీ షోల‌లో ఉంటే బాగుంటుందన్న‌ది కొంద‌రి అభిప్రాయం. కానీ, బిగ్‌బాస్‌లోకి అడుగుపెడితే మాత్రం సుధీర్ ఆర్మీ రెడీ అయిపోతుంది. ఎంతమంది ఉన్నా ఓట్ల‌న్నీ సుధీర్‌కే వెళిపోతాయి. అంతలా బుల్లితెర‌మీద అల‌రిస్తూ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. జూన్‌లో ప్రారంభం కానున్న ఈ బిగ్‌బాస్ షోకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్‌ను కూడా నిర్వాహ‌కులు స్టార్ట్ చేసేశారు. ఈ సీజ‌న్‌కు ఎవ‌రెవ‌రిని తీసుకోవాలి..? అన్న అంశంపై నిర్వాహ‌కులు ఫుల్ బిజీగా ఉంటే తీసుకునే వారిలో సుధీర్ మాత్రం త‌ప్ప‌కుండా ఉండాల‌ని వారు భావిస్తున్న‌ట్టు సమాచారం. అయితే సుధీర్‌కు బిగ్ బాస్ ఆఫ‌ర్ వ‌స్తే వెళ‌తాడా..? లేక టీవీ షోల‌తోనే త‌న అభిమానుల‌ను అల‌రిస్తాడా..? అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది. సుధీర్‌కు జంట‌గా ర‌ష్మీ వ‌స్తే మాత్రం ఇక అది షో అవ‌దు. ఎందుకంటే..? అంద‌రి ఫోక‌స్ సుధీర్ - ర‌ష్మీల మీద‌నే ఉంటుంది క‌నుక‌. ఏదేమైన సుధీర్‌, ర‌ష్మీ వీరిలో ఎవ‌రో ఒక‌రికి త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ బిగ్‌బాగ్ సీజ‌న్‌లో ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Next Story