నేటి నుంచి బిగ్‌బాస్‌ -4.. కంటెస్టెంట్లు వీరేనా..?

By సుభాష్  Published on  6 Sep 2020 4:50 AM GMT
నేటి నుంచి  బిగ్‌బాస్‌ -4.. కంటెస్టెంట్లు వీరేనా..?

తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్‌ రాబోతోంది. బుల్లితెరపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పండగేనని చెప్పాలి. మొదటి మూడు సీజన్లు విజయవంతంగా ముగిసి.. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌-4 షో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో సైతం వైరల్‌ అవుతోంది. ఇక నాలుగో సీజన్‌కు మరోసారి మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారు. అయితే నాగార్జున ఈ సారి భిన్నంగా మూడు గెటప్ప్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ప్రస్తుతం వార్తల్లో ఉన్న కంటెస్టెంట్ల పేర్లు:

1. లాస్య మంజునాథ్‌ (టీవీ నటి)

2.మహాతల్లి జాహ్నవి (యూట్యూబర్‌)

3.గంగవ్వ (మై విలేజ్‌ షో స్టార్‌)

4. సుజాత (టీవీ యాంకర్‌)

5. అవినాష్‌ (జబర్దస్త్‌ షో కమెడియన్‌)

6. సత్య (న్యూస్‌ రీడర్‌)

7. సుహైల్‌ రెయాన్‌

8. సూర్యకిరణ్‌(డైరెక్టర్‌)

9. అమ్మ రాజశేఖర్‌ (కొరియోగ్రఫర్‌)

10. అభిజిత్‌ (హీరో)

11. దివి వైద్య (నటి)

12. కరాటే కళ్యాణి (నటి)

13 సురేఖ (నటి)

14. నోయల్‌ (సింగర్‌)

15 దేవి నాగవల్లి (యాంకర్‌)

16. పూజిత పొన్నాడ

అయితే ఇందులో మరో ముగ్గురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సింగర్‌ సునీత, నటి శ్రద్దాదాస్‌, నటుడు తరుణ్‌. షోలో పాల్గొనే 16 మంది మాత్రమే. వీరిలో ఎవరెవరు ఉంటారు.. ఎవరెవరు ఉండరనేది షో ప్రారంభం అయితే తప్ప తెలియదు. కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్‌లోకి వెళ్లాలి. ఆ క్వారంటైన్‌ 14 రోజులే. కానీ 16 మంది కంటెస్టెంట్లు 105 రోజుల క్వారంటైన్‌లోకి వెళ్లే సీజన్‌ వచ్చేంది. ఇక వీరి ఆటలు, పాటలు, గొడవలు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జీట్‌లు అలా అన్ని తెలియబోతున్నాయి. కరోనా చికాకును కాస్త దూరం చేసే భారీ డైలీ షో బిగ్‌బాస్‌-4.

కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్‌కి వెళ్లాలి. ఆ క్వారంటైన్‌ పద్నాలుగు రోజులే. కాని పదహారు మంది కంటెస్టెంట్‌లు 105 రోజుల క్వారెంటైన్‌కి వెళ్లే సీజన్‌ వచ్చింది. బిగ్‌బాస్‌ 4 సీజన్‌. ఇక వీరి ఆటలు, పాటలు, తగువులు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జిట్‌లు అన్నీ ప్రేక్షకులవి కూడా కాబోతున్నాయి. కరోనా చికాకును కాస్తయినా దూరం చేసే భారీ డైలీ డ్రామా బిగ్‌బాస్‌ 4.

షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయమై సస్పెన్స్‌ ఉంచడమే బిగ్‌బాస్‌ షో ఆనవాయితీ. అయితే ఇంతకు ముందు పద్దతి వేరు. ఇప్పుడున్న పద్దతి వేరు. గతంలో కంటెస్టెంట్లను షోకు రెండు, మూడు రోజుల ముందు తమ ఆధీనంలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా రెండు వారాల ముందు నుంచే వారిని ఆధీనంలోకి తీసుకోవడం, పరీక్షలు నిర్వహించడం, జాగ్రత్తలు తీసుకోవడం వంటివి జరిగాయి. అందుకే ఆగస్టు నెలాఖరు వరకు టెలికాస్ట్‌ కావాల్సిన షో.. సెప్టెంబర్‌ 6కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో ఎవరెవరు ఉంటారు అనేది తెలియాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో కొందరి పేర్లు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story