బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్ షురూ.. ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ

By సుభాష్  Published on  7 Sep 2020 10:34 AM GMT
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్ షురూ.. ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ

బిగ్‌బాస్‌-4 రియాలిటీ షో చి స్టార్‌ మాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వారికి ఎట్టకేలకు తెరపడింది. కరోనా కాలంతో తమ తమ ఇళ్లకే పరిమితమైన వారికి వినోదం పంచేందుకు రెడీ అయ్యాడు బిగ్‌బాస్‌. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ఆదివారం అట్టాహాసంగా ప్రారంభమైంది. నిన్న 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఇక అందరి కంటెస్టెంట్లలో ఒకరైన మై విలేజ్‌ షో గంగవ్వ ఎంటర్‌ కావడంతో హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపినట్లయింది. మై విలేజ్‌ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ హౌస్‌లోకి రాగానే అభిమానులు ఒక్కసారిగా పెరిగిపోయారు.

ఇక హౌస్‌లో తొలి ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం విడుదలైన ప్రోమో ద్వారా ఈ విషయం తెలుస్తోంది. నామినేట్‌ చేయాలనుకునే సభ్యుల పేర్లను చెప్పి వారి ముఖం మీదే కిటికి మూసివేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో సభ్యులందరిలో నామినేషన్‌ ఎదుర్కొనేందుకు చివరకు అభిజిత్‌, దేత్తడి హారిక మిగిలిపోయారు. అయితే ఈ ఇద్దరి నామినేషన్‌కు సంబంధించి గంగవ్వ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు జోర్దార్‌ యాంకర్‌ సుజాత, మరో యాంకర్‌ లాస్య ఎవరిని నామినేటెడ్‌ చేస్తానని అడుగగా, ఒక్క డైలాగ్‌తో తేల్చేయడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. 'ఎవరినీ నామినేట్‌ చేయొద్దు.. ఇద్దరూ ఉండనీ' అని గంగవ్వ చెప్పేసింది. మరి ఈ నామినేట్‌ గురించి బిగ్‌బాస్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో సోమవారం రాత్రి 9.30 గంటల వరకు ఆగాల్సిందే.Next Story