సెప్టెంబర్‌ 6 నుంచి బిగ్‌బాస్‌-4

By సుభాష్  Published on  29 Aug 2020 6:46 AM IST
సెప్టెంబర్‌ 6 నుంచి బిగ్‌బాస్‌-4

తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్‌ రాబోతోంది. బుల్లితెరపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పండగేనని చెప్పాలి. మొదటి మూడు సీజన్లు విజయవంతంగా ముగిసి.. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌-4 షో ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తమ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఈ షోలో టీవీ-9 దేవి, కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ దంపతులు, మై విలేజ్‌ షో గంగవ్వ, జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్‌ నోయల్‌ సేన్‌, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్‌ బజ్వా, పూజిత పొన్నాడ, యాంకర్లు లాస్య, అరియానా, యూట్యూబరర్లు అలేఖ హారిక, మహబూబ్‌ దిల్‌సేలు కంటెస్టెంట్లుగా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే నిర్వాహకులు ప్రోమోను సైతం విడుదల చేసేశారు. నాలుగో సీజన్‌కు మరోసారి మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారు. అయితే నాగార్జున ఈ సారి భిన్నంగా మూడు గెటప్ప్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు

Next Story