బిగ్‌బాస్-4 ప్రోమో విడుదల
By సుభాష్ Published on 21 July 2020 1:57 PM ISTబుల్లితెర అభిమానులకు ఇక పండగే అని చెప్పాలి. బిగ్‌బాస్-4 రియాలిటీ షో త్వరలో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షో తెలుగులో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలోకూడా రేటింగ్ పరంగా ఎంతో దూసుకుపోయింది. తెలుగు ప్రజలు కూడా ఈ షోకు ఎంతో ఆకర్షితులయ్యారు. ఇక నాలుగో సీజన్‌కు ముస్తాబవుతోంది. తాజాగా బిగ్‌బాస్-4కు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఈ షోలో ఎవరెవరు ఉంటారు..? ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ ను సైతం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గత మూడో సీజన్‌లో హోస్ట్ గా చేసిన టాలీవుడ్ కింగ్ నాగార్జున మళ్లీ నాలుగో సీజన్‌కు కూడా హోస్ట్ గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సీజన్‌కు వంద రోజులు కాకుండా కేవలం 70 రోజులే షో నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిసారి షో జూన్ లేదా జూలైలో ప్రారంభం అవుతుండగా, ఈ నాలుగో సీజన్ కరోనా ప్రభావంతో కాస్త ఆలస్యగా ప్రారంభం కానుంది.
అయితే బిగ్‌బాస్ -4 సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోలు తరుణ్, అల్లరి నరేష్, ప్రముఖ సింగర్ సునీత, యాంకర్లు ఝాన్సీ, రష్మీగౌతమ్, లాస్య, రవి, జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్, మంగ్లీ, నటీనటులు నందు,అఖిటీ, టీవీ నటుడు అఖిల్ సార్ధక్, టాలీవుడ్ నుంచి హంసానందిని, శ్రద్ధాదాస్,యామినీ భాస్కర్, వైవా హర్ష, బిత్తిరి సత్తి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం అధికారికంగా ఎలాంటి పేర్లు విడుదల చేయలేదు.