మంగళవారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రాసెస్ గురించి బాబా భాస్కర్, వరుణ్ చర్చించుకున్నారు. పునర్నవి తను హౌస్‌లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనకు భాష రాదని విమర్శించడం తనకు నచ్చలేదని వరుణ్ తో అన్నారు బాబా భాస్కర్. బిగ్‌బాస్‌ పదో వారంలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ శ్రీముఖికి ఒంటరయ్యాననే ఫీలింగ్‌ను తీసుకొచ్చింది.

 ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌.. హౌస్‌లో ఫుల్‌ ఫన్‌ క్రియేట్‌ చేసింది. పిసినారి రాణిగా శివజ్యోతి, కొడుకులుగా రవి, వరుణ్‌, రాహుల్‌.. కోడళ్లుగా శ్రీముఖి, వితికా, పునర్నవిలు మేనేజర్‌గా బాబా భాస్కర్‌, అతనికి అసిస్టెంట్‌గా మహేష్‌ తమ పాత్రల్లో లీనమై అందరినీ ఎంటర్‌టైన్‌ చేశారు.
పిసినారి రాణి అయిన శివజ్యోతి వద్ద ఉండే ఇటుకలను సంపాదించి.. కొడుకులైన రవి, వరుణ్‌, రాహుల్‌ గొడను నిర్మించవలసి ఉంటుంది. అయితే మూడు జంటలు కలిసి ఆడే ఈ ఆటలో చివరి వరకు ఎవరు ఎక్కువ ఎత్తులో ఉన్న గోడను కడతారో.. వారికి తదుపరి వారం కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపాడు. వీలునామా చివరకు ఎవరి చేతిలో ఉంటే.. వారు కూడా కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారని తెలిపాడు.

టాస్క్‌లో భాగంగా రవి-శ్రీముఖి, వరుణ్‌-వితికా, రాహుల్‌-పునర్నవి భార్యాభర్తలుగా నటించారు. ఇక శ్రీముఖి ఈ టాస్క్‌లో రెచ్చిపోయి నటించింది. అతి వినయం ప్రదర్శిస్తూ.. తన అత్త దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు నానా ప్రయత్నాలు చేసింది.  అత్త గుప్పిట్లో ఉన్న వీలునామాను చేజిక్కించుకునేందుకు వితికా ప్రయత్నించసాగింది. టాస్క్‌లో భాగంగా వీరిద్దరి సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. ఇక ముగ్గురు కొడుకులు తమ ప్రేమతో శివజ్యోతి ఉక్కిరిబిక్కిరి చేశారు.

నేటి ఎపిసోడ్‌లో ఫన్నీగా సాగిన ఈ టాస్క్‌ రేపటికి భీకరంగా మారేటట్టు ఉంది. వరుణ్‌, రాహుల్‌ మధ్య సంభాషణలు కూడా హద్దులు దాటేలా కనిపిస్తుంది. వీరి మధ్య పోరు ఎంతవరకూ వెళ్తుందో? వారి స్నేహాన్ని ఎలా దెబ్బతీస్తుందో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort