నామినేట్ అయిన రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 6:43 AM GMT
నామినేట్ అయిన రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాళ్లే రత్నాలు అనే టాస్క్‌.. రెండో రోజూ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్‌లో భాగంగా రాళ్లు ఏరుకునేప్పుడు వితికాపై మిగతా హౌస్‌మేట్స్‌పడటంతో వారిపై ఫైర్‌ అయింది. ఈ టాస్క్‌లో అలాగే అవుతుందని.. వరుణ్‌కూడా తిరిగి ఫైర్‌ అయ్యాడు. చివరకు మళ్లీ కూల్‌ చేసేందుకు వితికాను బుజ్జగించసాగాడు.

రెండో బజర్‌ మోగే సరికి మహేష్‌ దగ్గర తక్కువ రాళ్లు ఉండటంతో నామినేషన్‌లోకి వచ్చాడు. అయితే మూడో బజర్‌మోగే సరికి పునర్నవి దగ్గర తక్కువ విలువైన రాళ్లు ఉండటంతో పునర్నవి నామినేషన్‌లోకి వెళ్లింది.

ఇక చివరి బజర్‌ మోగేసరికి వరుణ్‌-బాబా భాస్కర్‌కు సరి సమానం వచ్చాయని.. వితికా ఇచ్చిన రాళ్లతో ఇద్దరూ సరిసమానం అయ్యారు. అయితే కెప్టెన్‌ అయిన శ్రీముఖి వారిద్దరిలోంచి ఒకరిని సెలెక్ట్‌ చేసుకుంటుందని వితికా చె‍ప్పుకొచ్చింది. అయితే చివరగా.. కురిసిన వర్షంతో వరుణ్‌ తక్కువగా సంపాదించుకోవడంతో నామినేషన్‌లోకి వచ్చాడు. దీంతో రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Next Story
Share it