బిగ్ బాస్ సీజన్‌ 3 రసవత్తరంగా సాగుతోంది. అలరించే టాస్కులు, చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లతో మంచి వినోదాన్ని పంచుతోంది.ఆదివారం ఇంటి సభ్యులను ఒక ఆట ఆడుకున్నాడు నాగార్జున. రిథమ్‌ ఆఫ్‌ లైఫ్‌ అంటూ డిఫరెంట్‌ పాటలు ప్లే చేస్తూ.. హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు చేయించాడు. గద్దలకొండ గణేష్ మూవీ ప్రొమోషన్ల కోసం వచ్చిన వరుణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వరుణ్ తన పంచులతో హౌస్ మేట్స్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా పునర్నవిని వరుణ్ పంచులతో అదరగొట్టాడు.

Image result for bigg boss himaja

 

వరుణ్‌కు ప్రపోజ్‌ చేయాలంటూ, శివజ్యోతి, హిమజ, పునర్నవి, వితికా, శ్రీముఖి లకు టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో తెలంగాణ యాసలో ప్రపోజ్‌ చేసి శివజ్యోతి విన్నర్‌గా నిలిచింది. చివరగా, హిమజ ఎలిమినేట్‌ అయినట్టు వరుణ్‌ ప్రకటించాడు.

Image result for bigg boss himaja

ఆ తరువాత, బిగ్ బాస్ హౌస్ లో ఆమె ప్రయాణాన్ని వీడియోగా చేసి చూపించాడు. అది చూసి హిమజ కన్నీరు పెట్టుకుంది. గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ అంటూ హిమజతో ఆట ఆడించాడు. ఆమె గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ అంటూ హౌస్‌మేట్స్‌ గురించి చెప్పాల్సి ఉంటుందని.. ఆ సమయంలో వారంతా ఐస్‌పై నిలిచి ఉంటారని టాస్క్‌ ఇచ్చాడు. శ్రీముఖి, రవి, వరుణ్‌, శివజ్యోతి గుడ్‌ అని.. వితికా, పునర్నవి, మహేష్‌ బ్యాడ్‌ అని.. బాబా భాస్కర్‌కు అగ్లీ అని హిమజ పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.