భారీ గ్యాస్‌ పేలుడు.. 15 మంది మృతి

By అంజి  Published on  16 March 2020 6:37 AM GMT
భారీ గ్యాస్‌ పేలుడు.. 15 మంది మృతి

నైజీరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వాణిజ్య నగరం లాగోస్‌లో చోటు చేసుకుంది. నేవీ కేంద్రం ఉన్న అమువో ఓడోఫిన్‌ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభివించింది. ప్రజలు చూస్తుండగానే పొగ గొట్టాలు గాలిలోకి ఎగిరాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది.. అక్కడికి చేరుకొని మంటలను అరికట్టేందుకు ప్రయత్నించింది. రాయిటర్స్‌ మీడియా సంస్థ తెలిపింది. ఆకాశం పూర్తిగా నల్లగా మారిపోయింది. పేలుడు ధాటికి 50కి పైగా భవనాలు కుప్ప కూలాయి. భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కాగా పేలుడుకు ఓ స్కూలు భవనం కూడా కూలింది. అయితే స్కూలు భవనంలో చిక్కుకున్న చిన్న పిల్లలందరినీ రక్షించినట్లు తెలిసింది. క్షతగాత్రులను నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ఆస్పత్రికి తరలించింది.

మరి కొన్నింటికి మంటలు అంటుకున్నాయని ఆ దేశ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అయిల్‌ పైప్‌లైన్‌కు మంటలు వ్యాప్తిస్తుండటంతో మరిన్ని పేలుళ్లు, నష్టం జరిగే అవకాశముందని ఆయన చెప్పారు. శిథిలాల కింద చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు 15 మృతదేహాలను వెలికితీసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే పేలుడు సంభవించడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ పేలుడులో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. లాగోస్‌లోని సైనిక ఆయుధ కర్మాగారంలో 2002లో బాంబులు పేలిన ఘటనలో 1000 మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే.

అయితే అఫ్రికాలోని అత్తిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారు అయిన నైజీరియాలో పైప్‌లైన్‌ మంటలు సర్వసాధారణం ది న్యూ యార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. చమురును దొంగిలించేందుకు ఉపయోగించే పద్దతుల కారణంగానే మంటలు చెలరేగుతాయని అంది.

Next Story