హైదరాబాద్‌: అత్తా కోడళ్లు టాస్క్ లో వరుణ్, రాహుల్ సిప్లి గంజ్, రవిక్రిష్ణలు కొడుకులుగా.. వితికా, పునర్నవి, శ్రీముఖిలు కోడళ్లుగా ఆయా పాత్రల్లో జీవించేస్తున్నారు. ఇక బాబా భాస్కర్, మహేష్ విట్టాలు అత్త శివజ్యోతికి పనివాళ్లుగా ఉన్నారు.

ఇలా నడుస్తుండగా…బిగ్ బాస్ అందరికి పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్నాడు. క్రితం వారం ఎలిమినేషన్‌తో ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటి సభ్యుల సంఖ్య 9కు చేరుకుంది. పోటీ తీవ్రం అవుతున్న సమయంలో ఎలిమినేట్ అయిన సభ్యుల్లోంచి రీ ఎంట్రీ ఇవ్వాలని బిగ్ బాస్ అనుకుంటున్నారు. ఇప్పటివరకు హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూరెడ్డి, అలీ రెజా, శిల్ప చక్రవర్తి, హిమజలు ఎలిమినేట్‌ అయ్యారు.

బిగ్‌బాస్‌ ఇచ్చే ఏ టాస్క్‌ అయినా.. దానికి పూర్తి న్యాయం చేసే వ్యక్తిగా, మోస్ట్‌ అగ్రెసివ్‌గా పేరు తెచ్చుకున్న స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అలీ రెజాను బిగ్‌బాస్‌ ఇంట్లోకి పంపించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా అలీ రాక రీఎంట్రీగా మారితే మాత్రం అతని అభిమానులకు ఇక పండగే. ఇక నేటి ఎపిసోడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీతో అలీ అదరగొట్టనున్నట్టు కనిపిస్తోంది. మరి అలీది రీఎంట్రీనా? లేదా? అని చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.