కొళాయి కొట్లాట లో విన్నర్ వితికా !!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 1:30 PM GMT
కొళాయి కొట్లాట లో విన్నర్ వితికా !!

11వ వారంలో 9 మంది కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ ఆట ఆసక్తికరంగా మారింది. ఈవారం నామినేషన్స్‌లో నలుగురు రాహుల్, పునర్నవి, మహేష్, వరుణ్‌లు ఉండటంతో ఆట మరింత రంజుగా మారింది.

Image result for vithika bigg boss

బాబా కిచెన్‌లో గరిటె తిప్పే పనిలో బిజీగా ఉంటే.. రాహుల్ ఇంటి సభ్యుల గురించి ‘ఏందిరో.. ఏందిరో’ అంటూ పాట అందుకున్నాడు. మహేష్‌ని నోటి దూల అంటూ పాట పాడాడు. నాకు కాదురా, నీకు నోటి దూల నాగార్జున నాలుగు సార్లు తిట్టారు అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. మరోవైపు శ్రీముఖి గురించి రాహుల్, వరుణ్, వితికా, అలీ, పునర్నవిలు గుసగుసలాడుకున్నారు. ఆమె హౌస్‌లో చేసే ప్రతి పని గేమ్‌లో భాగమే అని ఆరోపణలు చేశారు.

Image result for vithika bigg boss

బ్యాటిల్ మెడాలియన్ మొదటి లెవల్‌లో ఈవారం ఇంటి సభ్యుల కోసం, కుళాయి కొట్లాట అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో వితికా, శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీలు మాత్రమే పోటీ దారులుగా ఉన్నారు. ఇక టాస్క్ ఇచ్చినా ఎలాగూ పునర్నవి పెర్ఫామ్ చేయదు అనుకున్నారో ఏమో కాని.. బిగ్ బాస్ పునర్నవిని సంచాలకులుగా ఉండమన్నారు. టాస్క్ ప్రకారం ట్యాప్‌ల నుంచి బకెట్‌లలో నీళ్లు పట్టుకుని డ్రమ్స్‌ నింపాల్సి ఉంటుంది. గేమ్‌లో లేని రాహుల్, మహేష్, వరుణ్‌లు వీళ్లకు సాయం చేయవచ్చు .. నీళ్లు నింపకుండా అడ్డుకోవచ్చు అని చెప్పాడు బిగ్ బాస్.

Image result for vithika bigg boss

హౌస్‌లో రెండే టాప్‌లు ఉండటంతో ఒక ట్యాప్ శ్రీముఖి, శివజ్యోతి, వితికాలు వాటర్ పట్టుకునేందుకు పోటీపడ్డారు. ఇక బాబా భాస్కర్ వాటర్ పట్టుకోకుండా వరుణ్ సందేశ్ అడ్డుపడటంతో వివాదం రేగింది. సంచాలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. అనంతరం అలీ, శ్రీముఖిల మధ్య రచ్చ రేగింది.

Image result for vithika bigg boss

ఎలిమినేషన్ అప్పుడు బాగా ఏడ్చిందన్న కృత‌జ్ఞతతో, తన ఆటను సైతం పక్కనపెట్టేసి శివజ్యోతి కోసం గేమ్ అడాడు అలీ. దీంతో ఇది కరెక్ట్ కాదు అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ సీరియస్ అయ్యారు. సంచాలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకుని అలీ నీ ఆట నువ్ ఆడాలని కోరినా అలీ వినలేదు. దీంతో బిగ్ బాస్‌కి కంప్లైంట్ చేసింది పునర్నవి.

Image result for bigg boss punarnavi

చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్, అలీ- శివజ్యోతిలు నియమాలను ఉల్లంఘించారని అందుకే ఈ ఇద్దర్నీ టాస్క్‌ నుండి డిస్ క్వాలిఫై చేశారు. కంగుతున్న శివజ్యోతి ఏడ్వలేదు కాని.. తమ్ముడి తన కోసం త్యాగం చేస్తాడనుకుంటే బిస్కెట్ అయ్యిందని బాధపడింది. ఫైనల్‌గా ‘కుళాయి కొట్లాట’ టాస్క్‌‌లో ఎక్కువ నీటితో టబ్‌ నింపిన వితికా విన్నర్‌గా నిలిచింది. దీంతో బ్యాటిల్ మెడాలియన్‌కు డైరెక్ట్‌గా ఎంపిక అయ్యింది వితికా.

Image result for bigg boss punarnavi

Image result for bigg boss punarnavi

Next Story