హైదరాబాద్: 10వ వారం నామినేషన్స్‌లో భాగంగా....హౌస్‌లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్‌ను నాలుగు జంటలుగా విడగొట్టారు. మీలో ఎవరు గొప్పో తేల్చుకోవాలని ఫిటింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఈ నామినేషన్స్‌కి హౌస్‌ కెప్టెన్‌గా ఉన్న మహేష్ విట్టాకు మినహాయింపు ఇచ్చారు. శివజ్యోతి-శ్రీముఖి, బాబా భాస్కర్‌-పునర్నవి, వితికా-రవి, వరుణ్‌-రాహుల్‌ అంటూ విడగొట్టారు. ఇక వీరందరికి మూడు ప్రశ్నలను ఇచ్చి.. తమ తరుపున వాదించుకోమన్నారు. ఫైనల్‌గా ఇంటి సభ్యులందరూ వేసిన ఓట్ల ఆధారంగా నామినేట్‌ అవుతారని తెలిపాడు బిగ్ బాస్‌.

Image result for bigg boss 3 nagarjuna

ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల చర్చ హైలెట్‌గా నిలిచింది. బరిలో దిగిన శ్రీముఖి, శివజ్యోతి ఒక సందర్భంలో నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. తాము బిగ్ బాస్ లో ఆట ఆడుతున్నామన్న విషయం కూడా మర్చిపోయారు. ఇద్దరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. చివరకు ఇంటి సభ్యుల ఓటింగ్‌తో శ్రీముఖి నామినేషన్‌లోకి వెళ్లింది.

Image result for srimukhi big boss 3

తరువాత వితికా-రవిల్లో తక్కువ ఓట్లు రావడంతో రవి నామినేట్‌ అయ్యాడు. వరుణ్‌-రాహుల్‌ మధ్య పోటీలో, ఇంటి సభ్యులు దాదాపు అందరూ రాహుల్‌కు ఓటు వేశారు. దీంతో ఓట్లు తక్కువ రావడంతో వరుణ్‌ నామినేషన్‌లోకి వచ్చాడు. చివరగా వచ్చిన పునర్నవి-బాబా భాస్కర్‌ ల మధ్య జరిగిన పోటీలో బాబా నామినేట్‌ అయ్యాడు. దీంతో పదో వారానికిగానూ శ్రీముఖి, రవి, వరుణ్‌, బాబా భాస్కర్‌లు నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు బిగ్ బాస్.

Image result for srimukhi  ravi baba bhaskar

రాహుల్‌ది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని ప్రేక్షకులకు తెలుసు. కానీ.. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు తెలీదు. అయితే.. రాహుల్ తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడని తెలియడంతో హౌస్‌మేట్స్‌ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక వితికా, పునర్నవి, వరుణ్‌ చాలా ఆనంద పడ్డారు. సీక్రెట్‌ రూమ్‌లో ఉంటూ అందర్నీ గమనిస్తూ ఉన్నానని, అందరు మాట్లాడిన మాటలు విన్నానని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్‌.

Image result for bigboss 3 rahul

మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పదో వారం నామినేషన్స్‌లో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ నలుగురూ నిలిచారు. ఈ నలుగురిలో ఒకరు ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ వారం ఎలా సాగుతుందో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story