బిగ్ బాస్ 3 - మహేశ్ ను కాపాడలేక పోయిన హిమజ... కావాలనే చేసిందా??
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Sep 2019 1:24 PM GMTహైదరాబాద్ :బిగ్ బాస్ హౌస్ లో కొత్తగా టెలిఫోన్ బూత్ వెలిసింది. ఈ బూత్ ను ఉపయోగించి గత సీజన్ లో లాగానే నేరుగా ఎలిమినేషన్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. మొదటి ఫోను శ్రీముఖీ ఎత్తడం ఆమె నామినేట్ అయ్యింది, అయితే ఆమె ఎలిమినేషన్ నుండి తప్పించడానికి బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేయించుకున్నాడు.
పునర్నవి ని నామినేషన్ నుంచి కాపాడడానికి రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ రసం తాగాడు. రవి తనకిష్టమైన షూలను పెయింట్‌లో ముంచాడు. శ్రీముఖీ బిగ్ బాస్ ట్యాటూ వేయించుకుంది. వరుణ్ సందేశ్, హిమజను కాపాడడానికి పేడ ఉన్న టబ్ లో కుర్చోవడానికి ఒప్పుకున్నా, ఆ వాసన కి కూర్చోలేక పోయాడు. అయినా, అలానే కూర్చొని టాస్క్ ముగించాడు.
కానీ, మహేశ్ నామినేషన్ విషయానికొచ్చేసరికి మాత్రం తేడా కొట్టేసింది. మహేశ్ నామినేట్ అవ్వకుండా హిమజ తన వస్తువులన్ని బిగ్ బాస్ కి ఇచ్చేయ్యాలి, హిమజ అలాగే చేస్తుంది. తరువాత, కెప్టెన్ అయిన వితికా ను.. హిమజకు సంబంధించిన వస్తువులు, బట్టలు ఏమైనా ఉంటే చూసి చెప్పండని ఆదేశించాడు. దీంతో హిమజకు సంబంధించిన మేకప్ వస్తువులు, కొన్ని బట్టలు మిగలడం గమనించి వితికా బిగ్ బాస్ కి చెప్తుంది. దీంతో మహేష్ నామినేట్ అయినట్లు తేల్చేశాడు బిగ్ బాస్.
అయితే హిమజ కావాలనే ఇలా చేసిందని కొందరు అంటుండగా.. కాదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా హిమజ చేసిన ఈ పనితో మహేష్ నామినేషన్‌లోకి వచ్చేశాడు. దీంతో హిమజ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.