భూమా ఫ్యామిలీలో చీలిక! అఖిలప్రియపై తమ్ముడు వార్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 1:59 PM ISTభూమా కుటుంబంలో చీలిక వచ్చింది. ఎన్నికల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దూరమైతే...ఇప్పుడు సొంత తమ్ముడే అక్క అఖిలప్రియపై వార్ ప్రకటించారు.. ఇన్నాళ్లు ఇంట్లో గుట్టుగా సాగిన వ్యవహారాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. సొంత అక్క అఖిలప్రియపై తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డి కేసు పెట్టారు.
హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి సంబంధించి వివాదం చెలరేగింది. తాను మైనర్ గా ఉన్న సమయంలో వేలి ముద్రలు తీసుకున్నారని ..ఇప్పుడు తనకు తెలియకుండా భూమి అమ్మేశారనేది అఖిలప్రియ తమ్మడు జగత్ విఖ్యాత్ రెడ్డి వాదన. ఈ ఆస్తిలో తనకు కూడా వాటా కావాలని రంగా రెడ్డి జిల్లా కోర్ట్ ను జగత్ విఖ్యాత రెడ్డి ఆశ్రయించారు.
ఆస్తులతో పాటు ఆళ్లగడ్డ రాజకీయంలో కొన్నాళ్లుగా ఇంట్లో పోరు నడుస్తోంది. ఇటీవల ఎన్నికల సమయంలో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ఒంటెత్తు పోకడకు పోయారని తెలుస్తోంది. రాజకీయంగా ఈ ఇద్దరి వల్ల సమస్యలు వచ్చాయని కుటుంబంలో ఓ అభిప్రాయం ఏర్పడింది.
ఆళ్లగడల్లో ఓటమి తర్వాత భార్గవ్ రామ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల టైమ్‌లో జరిగిన విషయాలు తెలుసుకున్న విఖ్యాతరెడ్డి... తమకు అండగా ఉన్న కుటుంబాలను పిలిచి మాట్లాడినట్లు సమాచారం. ఆళ్లగడ్డ రాజకీయాలను తానే చూసుకుంటానని...అక్కకు సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఆస్తుల వివాదం బయటకు వచ్చింది. తమ్ముడికి తెలియకుండా అక్క,బావ కలిసి భూములు అమ్మినట్లు సమాచారం. దీంతో తనవాటా కోసం జగత్ విఖ్యాత్‌రెడ్డి ఫైట్ చేస్తున్నారు. మొత్తానికి భూమా కుటుంబంలో రేగిన ఈ వివాదం ఎటుదారితీస్తుందో అనే ఆందోళన కార్యకర్తల్లో ఉంది.