భీష్మ మూవీ డైరెక్ట‌ర్‌కి బంపర్ ఆఫ‌ర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 8:46 AM GMT
భీష్మ మూవీ డైరెక్ట‌ర్‌కి బంపర్ ఆఫ‌ర్

యువ హీరో నితిన్ ప్ర‌స్తుతం భీష్మ అనే సినిమా చేస్తున్నారు. దీనికి ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన భీష్మ టీజ‌ర్‌కి మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. ఎంత మంచి రెస్పాన్స్ అంటే... ఫ‌స్ట్ కాపీ సేల్ చేస్తారా అని అడిగేంత‌గా.

ఇలా భీష్మ సినిమాకి క్రేజ్ రావ‌డంతో డైరెక్ట‌ర్ వెంకీ కుడుములతో సినిమాలు చేసేందుకు నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజా వార్త ఏంటంటే... ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ వెంకీ కుడుముల‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం‌. నాగ చైత‌న్య‌, నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి తేజ్... ఇలా యువ హీరోల‌తో కూడా మంచి రిలేష‌న్స్ ఉన్నాయి.

వెంకీ కుడుముల మంచి క‌థ రెడీ చేస్తే... పైన చెప్పిన యువ హీరోల్లో ఎవ‌రో ఒక‌రితో సినిమా క‌న్ ఫ‌ర్మ్ కావ‌డం ఖాయం. మ‌రి... వెంకీ ఎలాంటి క‌థ రెడీ చేస్తాడో...? ఎవ‌రితో సినిమా చేస్తాడో..? చూడాలి.

Next Story