బైంసాలో మున్సిపల్ ఎన్నిక జరిగేనా..?
By Newsmeter.NetworkPublished on : 17 Jan 2020 5:14 PM IST

బైంసాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల సంఘం తర్జనభర్జన పడుతోంది. ఇప్పటి వరకు మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థుల ప్రచారం ప్రారంభం కాలేదు. బైంసాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని బీజేపీ పార్టీ కోరింది. నిబంధనల ప్రకారం ప్రచారానికి నాలుగు రోజుల సమయం సరిపోతుంది. ఒకవేళ బైంసాలో పరిస్థితులు చక్కబడకపోతే పోలింగ్ వాయిదా వేసే అవకాశం ఉంది.
కలెక్టర్, అబ్జార్వర్ లను రిపోర్ట్ అడిగాం.. సాయంత్రం వరకు నివేదిక వస్తుంది. వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారి తెలిపారు. 22వ తేదీన ఎన్నికలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం. ఒకవేళ 22న పోలింగ్ జరగకపోతే కరీంనగర్ కార్పోరేషన్ తో పాటు 24న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
Next Story