అహ్మదాబాద్ : ప్రొ కబడ్డీ టైటిల్ కొట్టేశారు. బెంగాల్ వారియర్స్ మొదటిసారి ప్రొ కబడ్డీ టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో ద బాంగ్ ఢిల్లీని బెంగాల్ వారియర్స్ మట్టి కరిపించారు. ఏడో సీజన్ పీకేఎల్ ఫైనల్లో బెంగాల్ చేతిలో ఢిల్లీ 39 -34 తేడాతో మట్టి కరిచింది. మ్యాచ్‌ మొదలైన 8 నిమిషాలకే బెంగాల్ ఆలౌట్ అయినప్పటికీ…తర్వాత బాగా పుంజుకున్నారు. 17 -17తో స్కోర్ సమం చేశారు. తరువాత 13 నిమిషాల్లో రెండు సార్లు ఢిల్లీని ఆలౌట్ చేసింది. ఢిల్లీ ఆటగాడు నవీన్ కుమార్ పోరాడిన ఫలితం లేకపోయింది. చివరకు 39 -34తేడాతో బెంగాల్ గెలిచి ప్రొ కబడ్డీ టైటిల్‌ను కిస్ చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.